ఒక్కో ప్రాంతలో ఒక్క ఆచారముంటుంది. ఇదిలావుంటే దేశవ్యాప్తంగా హోలీ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటుంటే.. ఉత్తరాఖండ్‌లోని 100కిపైగా గ్రామాలు మాత్రం సంబరాలకు దూరంగా ఉంటాయి. హోలీ) చేసుకుంటే దేవుడికి ఆగ్రహం వస్తుందని పిథోర్‌గఢ్ జిల్లాలోని ధార్చుల, మున్సియరీలోని 100కి పైగా గ్రామాల ప్రజల నమ్మకం. అందుకే హోలీతో పాటు అన్ని పండుగలకు వీరు దూరంగా ఉండటం గమనార్హం. ఏ పండుగలతోనూ వీరికి సంబంధం ఉండకపోవడానికి ఒక కారణం ఉంది. రంగుల మరకలతో ‘దేవుని స్వంత పర్వతాలను’ మలినం చేయకూడదని భావిస్తారు.
‘ఈ గ్రామాలలోని స్థానిక నివాసితులు చిప్లా కేదార్ దేవత శివపార్వతుల రూపాన్ని పూజిస్తారు...’ అని ధార్చులలోని బరం గ్రామ నివాసి నరేంద్ర సింగ్ అన్నారు. ‘ప్రతి మూడేళ్లకు ఒకసారి ఈ ప్రాంతంలో జరిగే చిప్లా కేదార్ యాత్ర స్థానికులు ఎంతో ముఖ్యమైంది. యాత్రలో భాగంగా సముద్ర మట్టానికి 16 వేల అడుగుల ఎత్తులో ఉన్న పవిత్రమైన చిప్లా కేదార్ కుండ్‌లో (దీనినే గుప్త కైలాసంగా పిలుస్తారు) మునిగి పరికర్మలను నిర్వహిస్తారు. దేవతలు కొలువున్న ప్రదేశాన్ని రంగులతో కళంకితం చేయకూడాదని బలంగా నమ్ముతారు’ అని నరేంద్ర సింగ్ చెప్పారు.
‘అందుకే హోలీ ఆడటాన్ని అపవిత్రంగా భావిస్తారు. ఈ వ్యక్తులకు హోలీ అనేది మరొక సాధారణ రోజు. కొన్నాళ్లుగా ఇదే ఆనవాయితీ, దేవుళ్లకు ఆగ్రహం తెప్పించే అవకాశం ఎందుకు తీసుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఎవరైనా హోలీ జరుపుకునే ప్రయత్నం చేసినా ఎదో ఒక అనర్ధం జరుగుతుందని నమ్ముతారు. గతంలో కొన్ని కుటుంబాల్లో ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్భాలున్నాయని చెప్పారు.
‘ఈ భూమి భరదీదేవికి చెందినది.. ఇక్కడ రంగు నిషేధం.. హోలీ దురదృష్టాన్ని తెస్తుందని నమ్ముతాం.. కాబట్టి మేం రంగులకు దూరంగా ఉంటాం’ అని మున్సియరీలోని హర్కోట్ గ్రామానికి చెందిన కౌశల్ హర్కోటియా తెలిపారు. ఇక, చరిత్రకారుల ప్రకారం హోలీ అనేది కొండ ప్రాంతాల్లో జరుపుకునే పండుగ కాదు. ‘‘ఉత్తరాఖండ్‌లో ముఖ్యంగా గర్వాల్‌లోని జౌసార్-బవార్‌తో పాటు ఇంతర మారుమూల ప్రాంతాల్లోని గిరిజన తెగలు హోలీ వేడుకలను నమ్మరు.. ఇక్కడ నుంచి వలస వెళ్లినవారు నెమ్మదిగా కొత్త సంపద్రాయాలు, సంస్కృతులకు అనుగుణంగా అలవాటుపడుతున్నారు.. కానీ, చారిత్రకంగా కొండ ప్రాంతాల్లో హోలీ ఓ పండుగ కాదు’’ అని ముస్సోరికి చెందిన చరిత్రకారుడు జై ప్రకాశ్ అన్నారు.
ధార్చులకు చెందిన సామాజిక కార్యకర్త జీవన్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘ఇవి మారుమూల గ్రామాలు ప్రధానంగా ఇక్కడ గిరిజనులు నివసిస్తున్నారు. ధార్చులలోని అన్వాల్ తెగ, మున్సియరీలోని జోహార్ ప్రాంతంలోని బర్పాటియా తెగ హిందువుల పండుగలును జరుపుకోరు.. కాబట్టి వారు నేటికీ హోలీ సంబరాలకు దూరంగా ఉంటారు.’ అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో సాంప్రదాయ హోలీ అనేది సమాజ సంప్రదాయాలకు సంబంధించినంత రంగులకు సంబంధించినది కాదని వేడుకలను జరుపుకునేవారు వ్యాఖ్యానించారు ‘ఇరుగుపొరుగు వారితో సమావేశాలు, సాంప్రదాయ వంటకాలను సమిష్టిగా వండటం, జానపద పాటలు పాడటం వంటివి కుమావోన్‌లోని ప్రసిద్ధ బైత్కీ హోలీ (సిట్టింగ్ హోలీ) వేడుకలను సూచిస్తాయి’ అని ఓ వ్యక్తి చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa