రాష్ట్రంలో పలుచోట్ల నూతన రోడ్లు, బ్రిడ్జిలను నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాలను సమీప పట్టణాలకు కలిపేలా 976 కి.మీ పొడవున వీటి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. వీటి నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తితో 1,110 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఆమోదం కోసం ఈ నెల 22న కేంద్ర అధికారులతో రాష్ట్ర అధికారులు భేటీ కానున్నారు.