ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని కీలక ప్రకటన చేశారు. జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతోన్న పిల్లలను స్కూళ్లకు పంపొద్దని తల్లిదండ్రులకు సూచించారు. వారికి సెలవులు ఇవ్వాలని హెచ్ఎంలకు సూచించారు. రాష్ట్రలో జ్వరాలు పెరుగుతున్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించి, జ్వర బాధితులకు వైద్యం అందించాలని మంత్రి అన్నారు.