కరక్కాయ పొడిని నీటితో కలిపి రోజుకు 2 సార్లు తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నూనెతో పాటు కరక్కాయ పొడి పేస్ట్ రూపంలో పూస్తే గాయాల్లో రక్తస్రావం తగ్గించి త్వరగా మానేలా చేస్తుందంటున్నారు. అలాగే చర్మ వ్యాధులను కూడా నయం చేస్తుందని పేర్కొంటున్నారు. కరక్కాయలో విటమిన్ సి, ఐరన్, మాంగనీస్, సెలీనియం, రాగి జుట్టుకు పోషణ ఇస్తాయంటున్నారు.