ఉత్తరప్రదేశ్ లోని మైన్ పురి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బంగాళదుంపలు తవ్వకాల విషయంలో తలెత్తిన వివాదంలో రౌడీలు ఓ మాజీ సైనికుడిని కాల్చి చంపారు. ఈ ఘటన కొత్వాలి ప్రాంతానికి చెందిన అంగోతా గ్రామంలో జరిగింది. కాల్పులు జరిపిన అనంతరం నిందితులు ఘటనా స్థలం నుండి పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.