పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలంలోని నారాయణపురం గ్రామంలో రాత్రి 22: 55 గంటల ప్రాంతం లో నారాయణపురం గ్రామానికి చెందిన యలమంచిలి హేమలత , వయస్సు 28 సం. లు అనే గృహిణి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ఎస్సై ప్రశాంత్ కుమార్ తెలిపారు. పోలీస్ వివరాల ప్రకారం తన ఇంటిలో ఉరి వేసుకొని చనిపోయినట్లు, మరియు ఆమె మరణము పైన సందేహాలు ఉన్నట్టుగా మృతురాలు తమ్ముడు కొమారాడ గ్రామం కు చెందినా పుల్లరి లోకేష్ పోలీస్ స్టేషన్ పిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు కన్నవారిది కొమరాడ గ్రామం, 2018 లో నారాయణపురం గ్రామ వాసి యలమంచిలి చిన్న నరసయ్య తో వివాహం జరిగింది మరియు వీరికి ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నట్లు తెలియజేశారు.