ప్రేమపేరుతో ఓ మహిళా న్యాయవాదిని సీనియర్ లాయర్ వేధించిన ఘటన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగింది. తన వద్ద ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి సొంతంగా ప్రాక్టీస్ చేస్తున్న మహిళను పెళ్లి చేసుకోవాలంటూ కొన్నాళ్లుగా చంద్రశేఖర్ వేధించేవాడు. ఈక్రమంలో బుధవారం రోషనాబాద్ కోర్టు ఆవరణలో హోళీ వేడుకలకు హాజరైన మహిళపై దాడి చేసిన చంద్రశేఖర్ ఆగ్రహంతో ఆమె ముక్కు కొరికేశాడు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.