జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ , కృష్ణాజిల్లాలో అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న 51 మంది కౌలు రైతుల కుటుంబ సభ్యులకు రూ.లక్ష చొప్పున సాయం అందజేస్తారని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. మచిలీపట్నం సమీపంలోని సుల్తానగరంలో 14న నిర్వహించనున్న జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. జనసేన, టీడీపీ పొత్తుపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు.