అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్లో లోకో పైలెట్‌గా పనిచేస్తున్న అంకిత్ ఖర్గే హంద్రీనీవా కాలువలో బుధవారం గల్లంతయ్యాడు. ఉత్తరాదికి చెందిన పలువురు లోకో పైలెట్లు గుంతకల్లు పట్టణంలో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. అనంతరం స్నానాలు చేసేందుకు వెస్ట్ గుంతకల్లు రైల్వేస్టేషన్ వద్ద ఉన్న హంద్రీనీవా కాలువ వద్దకు వెళ్లారు. మరో ఇద్దరితో కలిసి అంకిత్ ఈతకు దిగాడు. ముగ్గురూ మునిగిపోతుండగా అతని స్నేహితులను స్థానికులు కాపాడారు. అంకిత్ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని గాలించినా, రాత్రి వరకూ అంకిత్ ఖర్గ్గే ఆచూకీ లభించలేదు.