పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జి.వేణు(60) బుధవారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందారు. స్థానిక నరసరావుపేట సెంటర్‌లో ఓ హోటల్ వద్ద సహోపాధ్యాయులతో కుర్చీలో కూర్చొని ముచ్చటిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa