భారతదేశంలో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోని భారత విద్యార్థులకు శుభవార్త తెలిపారు. ఆస్ట్రేలియాలో భారతీయ డిగ్రీలకు గుర్తింపు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఆ దేశంలోని డీకీన్ యూనివర్సిటీ బ్రాంచ్ ను భారత్ లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. 'ఆస్ట్రేలియా-ఇండియా ఎడ్యుకేషన్ రికగ్నిషన్ మెకానిజం'ను ఇరు దేశాల విద్యార్థులకు లబ్ధి చేకూరేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు.