హైవే వద్ద ఆటోను తప్పించబోయిన లారీ అదుపు తప్పి బోల్తా కొట్టిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి. విజయవాడ హైదరాబాదు ప్రధాన రహదారిపై శుక్రవారం పెనుగంచిప్రోలు మండలం ముండ్లపాడు హైవే వద్ద ఆటోను తప్పించబోయిన లారీ అదుపు తప్పి బోల్తా కొట్టిన ఘటనలో గాయాల పాలైన డ్రైవర్ ను అటుగా నందిగామ నుండి జగ్గయ్యపేట వెళ్తున్న మాజీ శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ కారు ఆపి ఘటన స్థలానికి చేరుకొని గాయాలపాలైన డ్రైవర్ ను పరామర్శించి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు