ఈనెల 13వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని సుండుపల్లి ఎస్సై రామకృష్ణ తెలిపారు. గురువారం సుండుపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన ఎన్నికలు జరిగే భూతులను ఆయన పరిశీలించారు. అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. రానున్న ఎన్నికల్లో సిబ్బందికి కానీ ఓటర్లకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏవైనా సమస్యలు ఉంటే 12వ తేదీ లోపే తన దృష్టికి తీసుకురావాలని పాఠశాల సిబ్బందితోపాటు పోలీస్ సిబ్బందికి కోరారు.