పులివెందుల మున్సిపల్ కార్యాలయంలో గురువారం భూహక్కు- భూరక్షణ పథ కంపై మున్సిపల్ కమిషనరు నరసింహారెడ్డి సమీక్షించారు. సెక్రెటరీ లు సమన్వయం తో పనిచేసి పథకం విజయ వంతానికి కృషిచేయాలని సూచించారు. అలాగే ఆస్తి పన్ను వసూల్లు సచివాలయం పరంగా నూరు శాతం వసూలుకు శ్రమించాలి అన్నారు. జగనన్న హౌసింగ్ కాలనీలో నిర్మిస్తున్న ఇళ్లకు చెల్లించాల్సిన మొత్తాలను సచివాలయం వాలంటరీ ద్వారా గుర్తించి వారితో త్వరగా చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ఎనింగ్, వేల్ఫేర్ సెక్రటరీలు టౌన్ ప్లానింగ్ అధికారి అజయ్ కుమార్ మునిసిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రఘునాథ రెడ్డి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.