ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. తాను ఈడీకి ఇచ్చిన స్టేట్ మెంట్ ను ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ రౌస్ ఎవెన్యూ కోర్టులో అరుణ్ రామచంద్ర పిళ్లై పిటిషన్ దాఖలు చేశారు. రామచంద్ర పిళ్లై పిటిషన్ పై ఈడీకి కోర్టు నోటీసు ఇచ్చింది. పిళ్లైకి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్‌లో రామచంద్ర పిళ్లై సౌత్‌గ్రూప్‌లో ఎమ్మెల్సీ కవిత బినామీగా ఉన్నారని ఈడీ పేర్కొన్న విషయం తెలిసిందే.