పట్టభద్రుల, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలకు సంబందించి ఈ నెల 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అధికార వైసీపీ జిల్లా అధ్యక్షులు, కడప మేయర్ సురేష్ బాబు గురువారం ఇక్కడికి చేరుకొని ఎర్రగుంట్ల పట్టణంలోని స్థానిక పార్టీ కార్యాలయంలో సమీక్షించారు. మండల పార్టీ బాధ్యులు సురేంద్రారెడ్డి, రాష్ట్ర ఉద్యానశాఖ సలహాదారు సంబటూరు ప్రసాద్ రెడ్డి తదితరులతో ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు. పోలింగ్ సరళి, కేంద్రాల వద్ద ఏర్పాట్లపై కూడా వారు సమావేశంలో చర్చించుకున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు దాసరి సూర్య నారాయణరెడ్డితో పాటు పలువురు ఉన్నారు.