ఈ నెల 13వ తేదీ జరగనున్న శాసనమండలి ఎన్నికలకు సంబంధించి ఎర్రగుంట్ల పట్టణంలోని స్థానికంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను మున్సిపల్ కమీషనర్ పగడాల జగన్నాధ్ గురువారం పరిశీలించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో రెండు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబందించి మెయిన్ బజారులోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వీటి పరిసరాలను పరిశీలించిన కమీషనర్ పారిశుధ్యం నిర్వహణ, తాగునీటి ఏర్పాటు వంటి అంశాలపై సంబందిత అధికారులకు తగు సలహాలు, సూచనలు ఇచ్చారు. కేంద్రాల వద్ద ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాల్మెంట్ ఏఈ సందీప్, శానిటరీ ఇన్స్పెక్టర్ మధుకుమార్, శానిటరీ కార్యదర్శులు శ్రీదేవి, చంద్రావతి, ప్రధానోపాధ్యాయులు బాబురెడ్డి తదితరులు పాల్గొన్నారు.