దేశంలో హాంగ్‌కాంగ్ ఫ్లూ వణికిస్తుంది. ఈ ఫ్లూ జ్వరం సోకి ఇప్పటికే ఒకరు మృతి చెందగా తాజాగా మరొకరు ప్రాణాలు వదిలారు. వారిలో ఒకరు హర్యానా రాష్ట్రానికి చెందినవారు కాగా, మరొకరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు. H3N2 వైరస్ కారణంగా సోకే ఇన్‌ఫ్లూయెంజానే ఫ్లూ జ్వరం అంటున్నారు. ప్రాణాంతకమైన ఈ ఫ్లూ సోకిన వారిలో జ్వరం, చలి, దగ్గు, శ్వాస కష్టంగా ఉండటం, గురక లాంటి లక్షణాలు కనిపిస్తాయి.