వేంపల్లె మండలంలోని టి. వెలమవారిపల్లె గ్రామ పొలాల్లో నిప్పు అంటుకుని పి. నరసింహులు అనే రైతు అరటి తోట దగ్ధమైంది. గురువారం బాధితుడు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. టి. వెలమవారిపల్లె గ్రామ సమీప పొలాల్లో చుట్టూ ఉన్న కొండ ప్రాంతానికి నిప్పు పెట్టడంతో అవి క్రమేనా మంటలు వ్యాప్తి చెంది అరటి తోటకు వ్యాపించాయి. చుట్టూపక్కల రైతులు గమనించి ఆపొలం రైతుకు సమాచారం అందించారు. రైతు అక్కడికి చేరుకోగానే తన 5ఎకరాల అరటితోట మంటలు అంటుకోవడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు అరటి తోట పూర్తిగా కాలిపోయింది. అలాగే ప్లాస్టిక్ పైపులు, డ్రిప్ పరికరాలు కాలి బూడిదయ్యాయి. రూ. 10లక్షల మేర పంట నష్టం జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తనకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతు కోరారు.