ప్రతి విద్యార్థి ఇంటి ముందర ఇంకుడు గుంతను తవ్వించుకోవాలని నెహ్రు యువ కేంద్ర జిల్లా కోఆర్డినేటర్ మణికంఠ తెలిపారు. వేంపల్లి పట్టణంలోని స్థానిక వైయస్సార్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా నెహ్రూ యువ కేంద్రం సహకారంతో వర్షపు నీటిని ఒడిసి పట్టుట అని అంశంపై గురువారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. నీటిని ఒడిసి పట్టుట వలన కలిగే ప్రయోజనాలు, వాటి పద్ధతుల గురించి వివరించారు. అనంతరం డాక్టర్ ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ. ప్రతి విద్యార్థి తమ ఇంటి సమీపంలో ఇంకుడు గుంతలను తవ్వించుకుని మన వంతు బాధ్యతగా నీటిని సంరక్షించాలన్నారు. అనంతరం ఉపన్యాస పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులను ప్రధాన చేశారు. ఈ కార్యక్రమాలు వైస్ ప్రిన్సిపాల్ నాగేందర్, డాక్టర్ మల్లేశ్వరమ్మ, కిరణ్మయి, విద్యార్థులు పాల్గొన్నారు.