ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో.. విషాదం జరిగింది. ర్యాలీలో వచ్చిన కార్లలో ఒకటి ప్రమాదానికి గురైంది. కరకట్ట మీద నుంచి గాల్లోకి ఎగిరి పొలాల్లో పడింది. సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి అసెంబ్లీకి ర్యాలీగా వెళ్తుండగా.. ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారు. వారు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులు కైకలూరుకు చెందిన నేత జయమంగళ వెంకటరమణ అనుచరులుగా గుర్తించారు. ప్రమాదానికి గురైన కారును బయటకు తీయడం కష్టం కావడంతో.. క్రేన్‌ను తీసుకొచ్చారు. క్రేన్ సాయంతో పోలీసులు కారును బయటకు తీశారు.