విశాఖ జిల్లా సబ్బవరం మండలం పేరు చెబితే అడుగడుగునా అక్రమాలే. వైట్ కాలర్ నేరగాళ్లు ఇక్కడ రారాజులుగా చలామణి అవుతుంటారు. వీళ్లకు అధికారుల సహకారం పుష్పలంగా ఉంటుందనడంతో సందేహం లేదు. ఇక్కడ ప్రభుత్వ స్థలాలతో పాటు విలువైన కొండలతో కూడిన గ్రావెల్ సంపద ఎక్కువగా కనబడుతుంది. అయితే ఈ కొండలు రోజురోజుకి తరిగిపోతున్నాయి. ఈ విలువైన సంపదను కాపాడాల్సిన మైన్స్ అధికారులు రెవెన్యూ అధికారులు నిద్ర నటిస్తున్నారు. ప్రజా సంపద తరలి పోతున్నా. ఏది ఏమైపోతే మాకేంటి అన్న చందాన వీరి వ్యవహార శైలి కనబడుతుంది. అయితే వీళ్ల నిర్లక్ష్యానికి అద్దం పరమార్ధం ఉంది. అదేమనుకుంటున్నారా ధనమే ప్రధానం లక్ష్యంగా వీళ్లు విధులు నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి మైనింగ్‌ను కాపాడడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్లకి లక్షల జీతాలను ప్రజాధనాన్ని సమర్పిస్తుంటే లక్షల్లో జీతాలు తీసుకుంటూ అదీ చాలక అక్రమార్కులతో చేతులు కలిపి కోట్ల రూపాయలు కూడబెట్టుకుంటున్నారని గంగవరం గ్రామంలో జరుగుతున్న గ్రావెల్ దోపిడీ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అధికారులు కళ్లున్నా. కబోదుల్లా వ్యవహరించడం పలువుర్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేస్తున్న కేటుగాళ్లపై చర్యలు తీసుకోకపోవడంతో తమను ఆపేదెవరంటూ అధికారులకు సవాల్ విసురుతూ చెలరేగిపోతున్నారు గ్రావెల్ దొంగలు. స్థానికంగా వున్న విఆర్‌ఓ కళ్లముందు లారీలతో గ్రావెల్‌ను తరలిస్తుంటే కనీసం పట్టించుకునే పరిస్థితిలో లేకపోవడం వెనుక అంతర్యామేమిటో వారికే తెలియాలి. రెవెన్యూ అధికారులు పట్టించుకోక, అటు మైన్స్ అధికారులు మత్తునిద్ర నటిస్తూ పోలీసులు నిఘా వ్యవస్థలు తమకు సంబంధం లేనట్లు ఎవరికీ వారే యమునా తీరులా వ్యవహరించిన తీరు గ్రావెల్ దొంగలకు కలిసొచ్చింది. అందుకే ఫిర్యాదులొచ్చినా ఒకరిపై ఒకరు మీరంటే మీరు పట్టించుకోవాలంటూ ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ అందరూ కలిసి దొంగలకు తమ వంతు సహకారం అందిస్తున్నారన్నది తేటతేల్లమవుతుంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఎస్పీ నిఘా అధికారులు ఇక్కడ జరుగుతున్న అక్రమాలను అడ్డుకోవాలని పలువురు కోరుతున్నారు.