గిరిజన రైతులకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో కురుపాం మండలం సప్పగోత్తిలి లో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం ఉట్టిపోయింది. ఎత్తిపోతల పథకంలో పనిచేయవలసిన యంత్రాలు మూలకు చేరడంతో రైతులకు సాగునీరు అందడం లేదని రామకృష్ణ అనే రైతు తెలిపారు. దీంతో గిరిజన రైతులు వర్షాధారం పైనే ఆధారపడి పంటలు పండిస్తున్నారని పేర్కొన్నారు. తక్షణమే అధికారులు స్పందించి ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు చేయించాలని కోరారు.