పెన్షనర్ల సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణికి కురుపాం మండల తాలూకా పెన్షనర్ల సంఘం అధ్యక్షులు పాండురంగారావు ఆధ్వర్యంలో పెన్షనర్ల సంఘ సభ్యులు శుక్రవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి సమస్యలను సత్వరం పరిష్కరించాలన్నారు. పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.