పెళ్లైన నెల తర్వాత ఓ యువతి భర్తను వదిలేసి తన స్నేహితురాలితో వెళ్లిపోయిన ఘటన పశ్చిమబెంగాల్ లో జరిగింది. అలీపూర్ ద్వారా జిల్లాలోని ఫలాకాటాకి చెందిన ఓ యువతి, కాలేజీలో మరో యువతి ప్రేమించుకున్నారు. విషయం తెలుసుకున్న ఓ యువతి తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేశారు. అయితే, సదరు యువతి తాను ప్రేమించిన యువతితో వెళ్లిపోయింది. తమ ప్రేమను అంగీకరిస్తేనే ఇంటికి వస్తామని తేల్చిచెప్పారు.