తన కోడలి రక్తాన్ని అత్త అమ్మిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఈ ఘటన గతేడాది జరగ్గా తాజాగా బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. పూణెలోని విశ్రాంతివాడికి చెందిన బాధితురాలు బీడ్ జిల్లాలో భర్త, అత్తమామలతో ఉండేది. కట్నం కోసం వేధించారని ఓ నెలలో తన బహిష్టు రక్తాన్ని దూదితో సేకరించి సీసాలో నింపి మంత్రగాడికి రూ.50 వేలకు విక్రయించారని తన తల్లిదండ్రులకు చెప్పింది. ఎన్జీవో సాయంతో పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు.