బంగాళదుంపలకు ప్రభుత్వం మద్దతు ధరను నిర్ణయించాలని నిరసిస్తూ బీహార్ రైతులు బస్తాల కొద్దీ పంటను హైవే రోడ్డుపై పడేశారు. దీన్ని ఎక్కువగా పండించే బెగుసరాయ్ జిల్లా రైతులు పంటను వ్యాపారులు కొనకపోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్తాల్లో పంటను మార్కెట్ కు తీసుకొచ్చి జాతీయ రహదారిపై పోశారు. ఈ క్రమంలో గందరగోళం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.