ఝార్ఖండ్‌లోని జంషెద్‌పుర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అమర్నాథ్ సింగ్ అనే వ్యాపారికి భార్య మీరాతో తరచూ గొడవలు జరుగుతుండేవి. మీరాకు మతిస్థిమితం కూడా సరిగ్గా ఉండేది కాదు. ఈక్రమంలో ఓ రోజు గొడవ జరగటంతో ఆగ్రహించిన మీరా భర్తను హతమార్చింది. 5 రోజుల పాటు మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకుంది. ఇంట్లోకి ఎవరూ రాకుండా ఇంటి కంచెకు కరెంటు పెట్టింది. దీంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.