దేశంలో ఇన్ ఫ్లూయెంజా వైరస్ విజృంభిస్తోంది. హెచ్3ఎన్2 వైరస్, 8 హెచ్1ఎన్1 వైరస్ కేసులు చాపకింద నీరులా రోజురోజుకు విస్తరిస్తున్నాయి. సీజనల్ ఇన్ ఫ్లూయెంజా విజృంభిస్తున్న నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధులు, ఇప్పటికే వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రమాదం కలిగించే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఫిబ్రవరి 28 వరకు దేశవ్యాప్తంగా మొత్తం 955 హెచ్1ఎన్1 కేసులు నమోదయ్యాయి.