చిత్తూరు నగరంలో 15 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు రూ. 60 వేలు పైచిలుకు నగదును స్వాధీనం చేసుకున్నట్లు వన్‌టౌన్ సీఐ నరసింహారాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఆయన కథనం వరకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు చిత్తూరు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న జంతువదశాల వెనుక నిషేధిత పేకాట ఆడుతున్న 15 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు పేక ముక్కలు 6వేల పైచిలుకు నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసామని, కోర్టు ముందు హాజరు పరచనున్నట్లు తెలియజేశారు.