ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో పట్టపగలే దొంగలు రెచ్చిపోతున్నారు. పోష్ ఏరియా కవినగర్ మార్కెట్లో రోడ్డుపై వెళ్తున్న యువకుడి చైన్‌ను లాక్కెళ్లారు. స్కూటీపై వచ్చిన దుండగులు వెనుక నుంచి దాడి చేసి సెకన్ల వ్యవధిలోనే గొలుసును దోచుకెళ్లారు. ఒక్కక్షణం పాటు ఏం జరిగిందో తెలియక అయోమయానికి గురైన అతడు తర్వాత తేరుకుని స్కూటీ వెంట పరుగులు తీశాడు. సీసీ కెమెరాలో నమోదైన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.