దేశంలో ప్రస్తుతం H3N2 ఇన్ ఫ్లూయెంజా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. దీంతో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా దగ్గు, ముక్కు కారడం, గొంతు మంట, తలనొప్పి, ఒళ్లునొప్పులు, జ్వరం, చలి, అలసట, అతిసారం, వికారం, వాంతులు వంటి లక్షణాలుంటాయని చెబుతున్నారు. పౌష్టికాహారంతో పాటు వైద్యుల సూచన మేరకు మెడిసిన్, మాస్కులు, శానిటైజర్స్ వాడాలని సూచిస్తున్నారు.