ఓ కేసుకు సంబంధించి 2017లో జగ్గయ్యపేట పట్టణ ఎస్సైగా పనిచేసిన పి. ప్రియకుమార్, కానిస్టేబుల్ ఎస్. చిరంజీవి, పి. హరిబాబుకు జగ్గయ్యపేట కోర్టు ఇటీవల అరెస్టు వారింట్లు జారీ చేసింది. జగ్గయ్యపేట పట్టణానికి చెందిన నూకల సాంబను పోలీసులు అక్రమంగా బంధించి తీవ్రంగా కొట్టి గాయపరిచారని పేర్కొంటూ అతని భార్య 2017లో జగ్గయ్యపేట న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సమన్లు జారీ చేసినప్పటికీ కోర్టుకు హాజరుకానందున ఎస్సై, కానిస్టేబుల్ కు కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. ఈ కేసులో నిందితులైన అప్పటి ఎస్ ఐ లచ్చి నాయుడు, కానిస్టేబుల్ నాగరాజు ఈ నెల 27వ తేదీన కోర్టుకు హాజరు కావాలని అడిషనల్ జూనియర్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఎం శోభారాణి ఉత్తర్వులు ఇచ్చారు.