మార్చ్ 13వతేదీన జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీ సీతంరాజు సుధాకర్ గారికి మొదట ప్రాధాన్యత ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసినదిగా మెరకముడిదాం మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుచ్చర్లపాటి శివరామకృష్ణ ప్రసాద్ శనివారం కోరారు. ఈ సందర్భంగా ఆయన మెరకముడిదాం, ఎం. పాలెం గ్రామాల్లో వున్న పట్టభద్రులను కలిసి తమకు మద్దతు గా మొదటి ప్రాధాన్యత ఓటును వేయమని కోరారు. ఈ కార్యక్రమంలో స్దానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.