ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులను ఓట్లు అడిగే హక్కు సీఎం జగన్‌కు లేదని కేంద్ర లేబర్ బోర్డు చైర్మన్ వి.జయప్రకాశ్ నారాయణ విమర్శించారు. విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అసలు జగన్‌కు ఎమ్మెల్సీ ఓటు ఉందా? కడప వెళ్లి ఓటు వేసి రాగలరా? అని ప్రశ్నించారు. పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీగా దొంగ ఓట్లు నమోదుచేశారని ఆయన ఆరోపించారు. హామీలివ్వడం జగన్‌కు అలవాటని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం ఉద్యోగులకు లేనిపోని హామీలు ఇచ్చారని, ఆయన మాయమాటలు నమ్మొద్దని ఓటర్లను కోరారు.