రాష్ట్రంలో రైతుల ఆదాయాన్ని మెరుగుపర్చే లక్ష్యంతో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద రూ.1,148కోట్లు, కృషోన్నతి యోజన కింద రూ.506కోట్లతో 2023-24లో అమలు చేసే కార్యాచరణ ప్రణాళికలను వ్యవసాయశాఖ కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపనున్నది. దీనిపై శుక్రవారం అమరావతి సచివాలయంలో వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ప్రత్యేక కమిషనర్ హరికిరణ్, అనుబంధశాఖల అధికారులు సమావేశమై చర్చించారు. ఆర్‌కేవీవై, కేవై కింద కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు 60:40 నిధులు సమకూర్చనున్నాయి. ఈ పథకాల కింద పంట ఉత్పత్తి పెంపు, వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీ, బిందు సేద్యం, పొగాకుకు బదులు అపరాలు, నూనెగింజల సాగు వంటి కార్యక్రమాలను ఈ ప్రణాళికల్లో పొందుపర్చారు.