ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, పెదపాడు మండలం పాతముప్పారుకు చెందిన సానబోయిన మోహన్‌కృష్ణ(38) కొంత కాలంగా తన అత్త గారు గ్రామం గోపన్నపాలెం శివారు మసీదుపాడులో ఉంటున్నాడు. అతను ఆటో తొలుతూ జీవనం సాగిస్తున్నాడు. రోజూలానే శుక్రవారం మధ్యాహ్నం ఆటో తీసుకువచ్చి ఓనర్ దగ్గర పెట్టి ఇంటికి వెళ్లి భోజనం చేసి పడుకున్నాడు. సాయంత్రం నాలుగు గంటల సమయం లో తలుపు ఎంతకీ తీయకపోవడంతో భార్యా పిల్లలు గట్టిగా తోసిచూడగా, అతను ఫ్యాన్‌కు ఊరి వేసుకుని కనిపించాడు. దీంతో వారు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి శవపరీక్ష నిమిత్తం ఏలూరు ఆసుపత్రికి మోహన్ కృష్ణ మృతదేహాన్ని తరలించారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతికి కారణం తెలియాల్సి ఉంది.