ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలి లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ దుకాణంలో అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తుండగా మంటలు చెలరేగి దుకాణం కాలిబూడిదైంది. మంటలు పక్కనే ఉన్న దుకాణాలకు వ్యాపించాయి. అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పోలీసులు దుకాణం యజమాని నుండి 17 చిన్న సిలిండర్లు, 7 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. దుకాణ యజమానితో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa