గుంటూరులోని కొల్లి శారద హోల్సేల్ మార్కెట్ సెంటర్లో శనివారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. పోలీసులు తనిఖీలు నిర్వహించడానికి గమనించిన కొందరు మందుబాబులు ద్విచక్ర వాహనాల వేగం పెంచి వచ్చిన దారినే వెనక్కి వెళ్లే ప్రయత్నంలో కింద పడ్డారు. అప్పటికే రైతుబజార్లో విధులు నిర్వహిస్తున్న మరికొందరు పోలీసులు తప్పించుకుంటున్న వారిని పట్టుకుని కేసులు నమోదు చేశారు.