మంగళగిరి నియోజకవర్గంలో శానిటేషన్, ఫాగింగ్ అటకెక్కాయని పలువురు ప్రజలు వాపోతున్నారు. నగరంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల్లోని ప్రజలు టైఫాయిడ్, డెంగ్యూ వంటి విష జ్వరాలతో అల్లాడిపోతున్నారని అధికారులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. గతంలో ఉన్న అధికారులు వీధుల్లో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకునేవారని ప్రస్తుత కమిషనర్ ఏసీ గదికి పరిమితమయ్యారని పుర ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు డ్రింకింగ్ వాటర్ కెనాల్ లో జుట్టు కాడ గుర్రపు డెక్క పేరుకుపోయిందని, త్రాగునీరు కలుషితమవుతున్నా ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ అధికారులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.