వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 12వసంతాలు పూర్తి చేసుకుని ఆదివారం 13వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్ధానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలుతో కలసి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ వై. యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి వైసిపి పార్టీ జెండాను ఆవిష్కరించి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి రాష్ట్రంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మంత్రి ఉషాశ్రీచరణ్ తెలిపారు.