శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలంలో ఆదివారం వైయస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 12 ఏళ్ళు పూర్తి చేసుకొని 13వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వైయస్సార్సీపి శ్రేణులు కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ సామాజిక న్యాయమే ప్రధాన ఎజెండాగా పాలిస్తున్న సీఎం జగనన్న బాటలోనే పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ కూడా పయనిస్తూ సుపరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సోమందేపల్లి మండల ప్రజా ప్రతినిధులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సచివాలయ కన్వీనర్లు, సచివాలయ సోషల్ మీడియా కన్వీనర్లు, గృహ సారధులు, కార్యకర్తలు, వైయస్సార్సిపి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.