నిస్వార్థం, నిజాయితీతో సేవా కార్యక్రమాలు చేపడుతూ సమాజ శ్రేయస్సు లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ నిరంతర కృషి చేస్తోందని ట్రస్ట్ వ్యవస్థాపకులు సాయి రూప్ నల్లూరి, దుర్గాప్రసాద్ కొల్లూరి తెలిపారు. ఆదివారం నగరిలో ఓ ప్రవేట్ హెూటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు జూనియర్ ఎన్టీఆర్ పేరున ఉన్న జయహో జనతా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏ రాజకీయ పార్టీకి, ఏ రాజకీయ నాయకుడికి సంబంధం లేకుండా కేవలం జూనియర్ ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో ట్రస్ట్ 2021లో ప్రారంభించినట్లు తెలిపారు. కోవిడ్ విపత్తులో ఏడాదిపాటు ట్రస్ట్ సభ్యుల ద్వారా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలోని సుమారు 50 ప్రాంతాలలో నిత్య అన్నదానం చేయడం జరిగిందన్నారు.