సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల ఉద్ధరణకు ఏర్పడిన ప్రజా ప్రభుత్వమని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. ఆదివారం వైసిపి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కందుకూరు ఎమ్మెల్యే కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైసిపి నాయకులు కార్యకర్తలు మధ్య భారీ కేకును ఆయన కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. జగన్ ప్రభుత్వం నిరంతరాయంగా ప్రజా సంక్షేమం కోసం, పారదర్శంగా పనిచేస్తుందన్నారు.