అవుట్ సోర్సింగ్ పద్దతిలో ప్రభుత్వ వైద్యశాల్లో పని చేస్తున్న వైద్య సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం అందించాలని ప్రకాశం జిల్లా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు అన్నారు. ఆదివారం ఎర్రగొండపాలెంలోని ఎన్. జి. హోమ్ ఆవరణలో ఆ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిబ్బందికి ఇచ్చిన పనిని మాత్రమే ఇవ్వాలని అదనపు బాధ్యతలు వద్దు అన్నారు. అలాగే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ పరిధిలోని సిబ్బంది పాల్గొన్నారు.