జిల్లాలో ప్రశాంతంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర అశోక్ చెప్పారు. సోమవారం మధ్యాహ్నం జాయింట్ కలెక్టర్ మయూర అశోక్ గజపతినగరంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 11 గంటలకు 24% మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. ఓటు హక్కు వినియోగించుకుని వెంటనే వెళ్లిపోవాలని సూచించారు. కార్యక్రమంలో గజపతినగరం తాసిల్దారు మరడాన అరుణకుమారి, ఉప తాసిల్దార్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.