ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో మార్చి 13న పోలింగ్ జరిగే విజయనగరం సంస్కృత పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ఎం. దీపిక, ఐపీఎస్ సందర్శించి, భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించి, అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు సిబ్బందికి పలు భద్రతాపరమైన సూచనలు చేశారు.జిల్లా ఎస్పీ వెంట విజయనగరం డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, ఎస్బి సిఐ జి. రాంబాబు, 2వ పట్టణ సిఐ సీహెచ్. లక్ష్మణరావు, ఎస్ఐ ప్రసన్నకుమార్ మరియు ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.