ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార వైసీపీ భారీ అక్రమాలకు పాల్పడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. సీపీఎ్‌సను రద్దు చేయాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, పాఠశాలల విలీనం ఆపాలని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో వామపక్షాలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటుకు రూ. 5వేలు ఇస్తామంటూ ఉపాధ్యాయులు, పట్టభద్రులకు అధికార పార్టీ వల విసురుతోందని ఆరోపించారు.