నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన వైసీపీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డిని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు క్రమశిక్షణ కమిటీ అందించిన సిఫారసుల మేరకు అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది. గిరిధర్‌రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి స్వయానా తమ్ముడు అనే సంగతి అందరికి తెలిసిందే.