ప్రకాశం జిల్లా,దొనకొండ మండలంలోని చందవరం గ్రామంలో బాబు కోసం.. భావితరాల భవిష్యత్ కోసం టీడీపీ ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా లీగల్ సెల్ మాజీ అధ్యక్షుడు పరిటాల సురేష్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రంలో మత్తు పదార్థాల వ్యాపారం ఎక్కువై యువత బానిసలుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అన్యాయానికి గురైన రైతుల పక్షాన ప్రశ్నించేవారిని వేధించడమే లక్ష్యంగా వైసీపీ పాలకులు ఉన్నారని ధ్వజమెత్తారు. ఉద్యోగులు, టీచర్లు, కార్మిలను ఇబ్బం దులకు గురిచేస్తున్నారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే రైతులు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నూనె గుర వయ్య, జాన్, అంకయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.